📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిన్నమాల ఎంపీటీసీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

విన్నమాల ఎంపీటీసీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

-272 ఓట్ల మెజారిటీతో విజయం..
-మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు విజయాన్ని అంకితం
నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సహకారంతో నాయుడుపేట మండల పరిషత్ ఎన్నికల్లో విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పానీ శ్రావణ సంధ్య ఘన విజయం సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ బి. హరి రెడ్డి, మాజీ సర్పంచ్ వాకాటి సోమశేఖర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విన్నమాల ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలోని అన్ని గ్రామాల ఓటర్లు తమపై నమ్మకంతో ఆదరించి, మద్దతు తెలిపి తిప్పానీ శ్రావణ సంధ్యను 272 ఓట్ల మెజారిటీతో గెలిపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
బలమైన కూటమి అభ్యర్థిని ఎదుర్కొని ప్రజల ఆదరాభిమానాలతో సాధించిన ఈ విజయం కార్యకర్తల కృషికి, ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి ఓటరుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విజయాన్ని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు అంకితం ఇస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!