చౌడేపల్లి, నవంబర్ 9, సత్య వెలుగు న్యూస్: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం బాండ్ల స్వీకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చౌడేపల్లి ఎస్సై తెలిపారు. చౌడేపల్లి, సదుం, సోమల మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల నుంచి నిర్ణీత తేదీల్లో బాండ్లు, అవసరమైన ఒరిజినల్ పత్రాలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
మండలాల వారీగా తేదీల వివరాలు:
- నవంబర్ 9 (సోమవారం): చౌడేపల్లి మండలం
- నవంబర్ 10 (మంగళవారం): సదుం మండలం
- నవంబర్ 11 (బుధవారం): సోమల మండలం
ఈ ప్రక్రియ చిత్తూరులోని సాయుధ దళ కార్యాలయం, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్లు, పత్రాలు స్వీకరిస్తారు.
బాధితులు తీసుకురావాల్సిన పత్రాలు:
- ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్ తప్పనిసరిగా చూపించాలి.
- బాండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ జిరాక్స్.
- బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.
- ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ జిరాక్స్.
- రేషన్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్.
- నామినీ ఆధార్ కార్డు జిరాక్స్.
- డిపాజిటర్ మరణించి ఉంటే డెత్ సర్టిఫికెట్.
- బంధుత్వాన్ని నిర్ధారించే ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ లేదా ఫ్యామిలీ సర్టిఫికెట్.
- అవసరమైన చోట అథరైజేషన్ లేదా అఫిడవిట్.
- ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
చౌడేపల్లి, సదుం, సోమల మండలాలకు చెందిన బాధితులు తమకు కేటాయించిన తేదీల్లోనే అన్ని ఒరిజినల్ పత్రాలు, జిరాక్స్ ప్రతులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు:
- భాస్కర్ రెడ్డి, డీఎస్పీ, సీఐడీ తిరుపతి: 9989500066
- రంగస్వామి, ఐఓ, పీఆర్ఓ, సీఐడీ: 8886564694




