📄 ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅమరావతిఅమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ

అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

అమరావతి నగరంలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల ఎత్తైన పొట్టి  శ్రీ రాములు  విగ్రహాన్ని ముఖ్యమంత్రి N. నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రత్యేకంగా శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించడం విశేషంగా నిలిచింది. వారి సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ జరగడం కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

వేదికపై ముఖ్యమంత్రిగారికి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల ఫోటోను చూపిస్తూ, వారి వారసత్వాన్ని వివరించిన ఆయన మునిమనవరాలు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంలో శ్రీరాములు గారి త్యాగం, ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్నారు.

ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా యువతకు స్ఫూర్తి కలిగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!