📄 ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి నివాళులు

బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి నివాళులు

📰 Generate e-Paper Clip

తిరుపతి: దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ఎం. గురుమూర్తి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు అమోఘమని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన, తన జీవితాన్ని సామాజిక సమానత్వానికి అంకితం చేశారని గుర్తుచేశారు.
కుల వివక్షను నిర్మూలించడానికి, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడానికి ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని గురుమూర్తి తెలిపారు. నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!