📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయిచౌడేపల్లి బస్టాండ్‌లో ఎయిడ్స్‌పై కళాజాత ద్వారా అవగాహన

చౌడేపల్లి బస్టాండ్‌లో ఎయిడ్స్‌పై కళాజాత ద్వారా అవగాహన

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 26 (సత్య వెలుగు న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం చౌడేపల్లి బస్టాండ్‌లోని పైసల్టర్‌లో కళాజాత ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కళాజాత బృందం నాటకం ద్వారా ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించింది. రక్తదానం, లైంగిక వ్యాధులకు చికిత్స, కండోమ్ వినియోగం, ఐసీటీసీ కౌన్సెలింగ్ కేంద్రాలు, క్షయ వ్యాధిపై కూడా అవగాహన కల్పించారు.

ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపకుండా, వారిని ఆదరించాలని కళాజాత బృందం ప్రజలకు సూచించింది. కార్యక్రమంలో గణేష్, సుబ్బరాము, బిట్రగుంట, నాగస్వామి, లక్ష్మీదేవి, నారాయణరెడ్డి, రమణమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!