సత్య వెలుగు న్యూస్, చౌడేపల్లి, సెప్టెంబర్ 27: ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవిని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏరియా అథారిటీ ప్లానింగ్ సెక్రటరీ డి.వి. మహేష్ కుమార్ ఆదివారం మిత్రులతో కలిసి దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న మహేష్ కుమార్, మిత్రులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి శేషవస్త్రం కప్పి, వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ దర్శన కార్యక్రమంలో మహేష్ కుమార్‌తో పాటు రాజన్న, మంజన్న, శంకర గౌడ, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

