📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యచౌడేపల్లిలో 1968-69 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

చౌడేపల్లిలో 1968-69 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, చౌడేపల్లి, సెప్టెంబర్ 27: చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో 1968-69 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. దాదాపు 57 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ క్షేమ సమాచారాన్ని తెలుసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.

తాము విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో 70 ఏళ్లకు పైబడిన వయసులో మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా, ఆదర్శంగా ఉందని వారు తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలు, గురువులతో గడిపిన రోజులు, పాఠశాల జీవితంలోని సరదా సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

విద్యను పూర్తిచేసుకుని వివిధ రంగాల్లో స్థిరపడిన విషయాలను పరస్పరం పంచుకున్నారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా కలిసి భోజనం చేశారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమాశంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, 1968-69 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!