నాయుడుపేట, సెప్టెంబరు 17: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు.
సూళ్లూరుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 33 మంది లబ్ధిదారులకు రూ.26.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తాజా పంపిణీతో కలిపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 661 మందికి రూ.6.01 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


