నాయుడుపేట: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు పాపిరెడ్డి రాజశేఖర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో దేశ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయుడుపేటలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు
0
3
Previous article


