దొరవారిసత్రం, సెప్టెంబర్ 17 : కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సౌకర్యాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
గత రెండేళ్లలో ఆసుపత్రిలో ఓపీ సేవలు 56 వేల నుంచి 61 వేలకు, ఐపీ సేవలు 2,700 నుంచి 3,400కు పెరిగాయని, ల్యాబ్ పరీక్షలు కూడా రెట్టింపయ్యాయని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు


