📄 ePaper
Wednesday, November 11, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట సామాజిక వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

నాయుడుపేట సామాజిక వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, సెప్టెంబర్ 21 | సత్య వెలుగు న్యూస్

నాయుడుపేట సామాజిక వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లకాయల విజయ్ కుమార్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు వినతిపత్రం అందజేశారు.

నాయుడుపేట పరిసర ప్రాంతాల డయాలసిస్ రోగులు చికిత్స కోసం తిరుపతి, నెల్లూరు నగరాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్థానికంగానే డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే గతంలో ఏర్పాటు చేసి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ట్రామా కేర్ సెంటర్‌ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!