📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం!

ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం!

📰 Generate e-Paper Clip

-పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. చర్యలు ఎప్పుడు?

సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు, నవంబర్ 10: పుత్తూరు మండలం నందిమంగళం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6, సబ్ డివిజన్ 3, 4, 5కు సంబంధించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, ఈ నిర్మాణం విషయంలో అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందా? నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ స్పందించి సర్వే నంబర్ 6లోని 3, 4, 5 సబ్ డివిజన్ల భూమిని అధికారికంగా సర్వే చేయించి, ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే మౌనం వహిస్తే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? అన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!