చౌడేపల్లి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
చౌడేపల్లి మండలంలోని వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ప్రజాప్రతినిధులకు మండల వైసీపీ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ పదవీకాలంలో చేపట్టిన తాగునీరు, రోడ్లు, లింక్ రోడ్లు, బోయకొండ గంగమ్మ ఆలయ అభివృద్ధి తదితర కార్యక్రమాలను గుర్తుచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం సెప్టెంబర్ 23, 24 తేదీలతో ముగుస్తున్న నేపథ్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం జడ్పీటీసీ దామోదర్ రాజు, ఎంపీపీ గాజుల రామ్మూర్తి, ఎంపీటీసీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు, రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి రుక్మిణమ్మ, నాయకులు నరసింహులు యాదవ్, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కూరపర్తి అంజిబాబు, మండల అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి, జంగాలపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

