చిత్తూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) పరిధిలోని AI కోఆర్డినేటర్లు తమ లాగిన్లో నమోదైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లను తప్పనిసరిగా పరిశీలించాలని APOSS DCO కార్యాలయం సూచించింది.
స్టడీ సెంటర్లలో పెండింగ్లో ఉన్న అన్ని అప్లికేషన్లను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, విద్యార్థుల వివరాలను సరిచూసిన అనంతరం అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది.
విత్అవుట్ ఫైన్ అడ్మిషన్లకు ఈ శనివారమే చివరి తేదీ అని, ఆ తర్వాత గడువు పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రతి AI కోఆర్డినేటర్ తమ పరిధిలోని పెండింగ్ అప్లికేషన్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
— APOSS DCO కార్యాలయం, చిత్తూరు

