నగరి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు న్యూస్): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ పుస్తకం రాశారని ఆరోపిస్తూ రచయిత హమారా ప్రసాద్‌పై BSP నగరి నియోజకవర్గ కమిటీ నగరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
BSP రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. పుస్తకంలోని అంశాలపై విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో BSP నగరి ఇన్‌చార్జ్, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు Y.P. నాగూర్, నియోజకవర్గ అధ్యక్షులు దారాల సుబ్బరాయులు, జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పవర్ రామచంద్రన్, బహుజన నాయకులు రత్నం, ఎంకే శశికుమార్, యన్. పళణి తదితరులు పాల్గొన్నారు.

