📄 ePaper
Sunday, September 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeనాయుడుపేటనాయుడుపేటలో వినాయక మండపాల పరిశీలన

నాయుడుపేటలో వినాయక మండపాల పరిశీలన

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: డీఎస్పీ సూచనల మేరకు, అర్బన్ సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాలతో ఎస్సై శివశంకర్‌రావు పట్టణంలోని పలు వినాయక మండపాలను పరిశీలించారు.

వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై కోరారు. పోలీసులకు నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!