📄 ePaper
Sunday, September 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeనాయుడుపేటనిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న వైసీపీ నాయకులు: ఎమ్మెల్యే విజయశ్రీ

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న వైసీపీ నాయకులు: ఎమ్మెల్యే విజయశ్రీ

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: గత ఐదేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో వైసీపీ నాయకులు ఆటాడుకున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆరోపించారు.

ఆదివారం నాయుడుపేటలో డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన సురేంద్ర, సీహెచ్. గీతాంజలి నివాసాలకు వెళ్లిన ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో ప్రతిభ ఆధారంగా అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే, వైసీపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు సాధించిన యువతే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలని పేర్కొన్నారు.

నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ రఫీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!