📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యకోటూరు పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు చైర్మన్‌గా పి. ఖాదర్ వలీ, వైస్ చైర్మన్‌గా...

కోటూరు పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు చైర్మన్‌గా పి. ఖాదర్ వలీ, వైస్ చైర్మన్‌గా డి. గీత ఎన్నిక

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 29, సత్య వెలుగు న్యూస్:
చౌడేపల్లి మండలం కోటూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం సజావుగా నిర్వహించారు.

మండల విద్యాశాఖ అధికారి తిరుమలమ్మ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బళ్ళాపురం మురళి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, బాల్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పి. ఖాదర్ వలీ చైర్మన్‌గా, డి. గీత వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 13 మంది సభ్యులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బళ్ళాపురం మురళి ఆధ్వర్యంలో నూతన కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి

పాఠశాలలో నెలకొన్న సమస్యలను నూతన పాఠశాల యాజమాన్య కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం, అదనపు తరగతి గది ఏర్పాటు పాఠశాలకు అత్యవసరంగా అవసరమని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కమిటీ సభ్యులకు వివరించారు.

ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఉన్నతాధికారులను సంప్రదించి కాంపౌండ్ వాల్, అదనపు తరగతి గది నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, షాహిన్, తేజస్విని, బాబు, రమేష్, శివకుమార్, ఉషారాణి, రమణ, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!