📄 ePaper
Wednesday, October 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు

📰 Generate e-Paper Clip

– ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్‌కు స్వర్ణ పురస్కారం
– సమాచార, పౌర సంబంధాల శాఖకు రజత పురస్కారం
– డిజిటల్ పరిపాలనకు లభించిన జాతీయ గుర్తింపు
– అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, సెప్టెంబర్ 27 ,సత్య వెలుగు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్‌కు అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిజిటల్, సామాజిక మాధ్యమ ప్రచారం మరియు అవగాహన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్వర్ణ పురస్కారం లభించింది. దేశవ్యాప్తంగా అత్యంత పరిమిత సంఖ్యలో ప్రదానం చేసిన స్వర్ణ పురస్కారాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్‌కు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

అదేవిధంగా సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన మీడియా అక్రిడిటేషన్, నిర్వహణ వ్యవస్థకు రజత పురస్కారం లభించింది. దేశవ్యాప్తంగా ప్రదానం చేసిన 30 రజత పురస్కారాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖకు దక్కడం హర్షణీయమని ముఖ్యమంత్రి అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారిత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమన్నారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు తెలిపారు. డిజిటల్ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తూ పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన మీడియా అక్రిడిటేషన్ నిర్వహణ వ్యవస్థ ద్వారా సేవల అందజేత మరింత పారదర్శకంగా, సులభతరంగా మారిందని అధికారులు తెలిపారు. సాంకేతికతను వినియోగించి ప్రభుత్వ సేవలను వేగవంతం చేసే దిశగా చేపట్టిన చర్యలకు ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచిందన్నారు. ఈ పురస్కారాలు రాష్ట్రంలోని డిజిటల్ పరిపాలన సామర్థ్యాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ అధికారులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!