📄 ePaper
Wednesday, October 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్లె పండుగ–3.0 విజయవంతం చేయాలి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

పల్లె పండుగ–3.0 విజయవంతం చేయాలి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

📰 Generate e-Paper Clip

– ఆత్మకూరులో కూటమి నాయకుల సన్నాహక సమావేశం
– లక్ష మందితో భారీ సభ నిర్వహణకు ఏర్పాట్లు
– సెప్టెంబర్ 29న రామాపురంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొననున్న కార్యక్రమం
– గ్రామీణాభివృద్ధికి పల్లె పండుగ–3.0 మైలురాయిగా నిలుస్తుందన్న మంత్రి

ఆత్మకూరు, సెప్టెంబర్ 27 ,సత్య వెలుగు న్యూస్ : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న నిర్వహించనున్న ‘పల్లె పండుగ–3.0’ కార్యక్రమాన్ని అఖండ విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసే కార్యక్రమంగా ఇది నిలుస్తుందని అన్నారు.

లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని మంత్రి కోరారు. కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం మరింత విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ.11,085 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. సీసీ రహదారులు, బీటీ రహదారులు, మినీ గోకులాలు, ఉద్యాన పంటల ప్రోత్సాహం వంటి అనేక కార్యక్రమాలు అమలు కానున్నాయని వివరించారు.

మెట్ట ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి వీబీ–జీ రామ్ జీ పథకానికి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!