📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచిత్తూరు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నిరసన సెప్టెంబర్ 28న భారీ నిరసనకు పిలుపు

చిత్తూరు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నిరసన సెప్టెంబర్ 28న భారీ నిరసనకు పిలుపు

📰 Generate e-Paper Clip

చిత్తూరు, సెప్టెంబర్ 25: ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28, సోమవారం ఉదయం 10:30 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డి. రమేష్ బాబు తెలిపారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఓటర్ల జాబితా మార్పులు, ఎన్నికల ప్రక్రియపై స్వతంత్ర సమీక్ష చేపట్టాలని కూడా పార్టీ కోరుతోంది.

ఈ నిరసనకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డి. రమేష్ బాబు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!