📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeస్పోర్ట్స్స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

📰 Generate e-Paper Clip

నాగోయా, సెప్టెంబరు 27, సత్య వెలుగు న్యూస్: ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్‌ క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల సింగిల్స్‌లో అనాహత్‌ సింగ్‌, పురుషుల సింగిల్స్‌లో అభయ్‌ సింగ్‌ రజత పతకాలు సాధించారు. దీంతో ఒకే ఆసియా క్రీడల ఎడిషన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో భారత్‌ రజతాలు గెలుచుకోవడం ఇదే తొలిసారి.

అనాహత్‌ సింగ్‌ చరిత్ర

18 ఏళ్ల అనాహత్‌ సింగ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో మలేసియాకు చెందిన శివశంగరి సుబ్రహ్మణ్యం చేతిలో 4-11, 4-11, 7-11తో ఓటమి పాలైంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ ఆసియా క్రీడల మహిళల సింగిల్స్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
ఇప్పటివరకు భారత స్క్వాష్‌ దిగ్గజాలు దీపికా పల్లికల్‌, జోష్నా చిన్నప్ప మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాలకే పరిమితమయ్యారు. తాజాగా అనాహత్‌ వారి రికార్డును అధిగమించి రజతం సాధించింది.
అభయ్‌ సింగ్‌కు రజతం

పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో అభయ్‌ సింగ్‌ మలేసియాకు చెందిన ఎన్‌గ్‌ ఈన్‌ యో చేతిలో 0-3తో ఓటమి చవిచూశాడు. 9-11, 5-11, 5-11తో వరుస గేముల్లో పరాజయం పాలై రజత పతకాన్ని అందుకున్నాడు.
అయితే ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన రెండో భారత స్క్వాష్‌ క్రీడాకారుడిగా అభయ్‌ రికార్డు నెలకొల్పాడు. గతంలో సౌరభ్‌ ఘోషల్‌ ఈ ఘనత సాధించాడు. ఒకే ఎడిషన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు రజతాలు సాధించడం దేశ స్క్వాష్‌ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!