నారాయణవనం, సత్య వెలుగు న్యూస్: నారాయణవనం మండలంలోని వెత్తలతడుకు మాదిగపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) సమావేశం నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. జ్యోతి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని నూతన ఎస్‌ఎంసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీ చైర్మన్‌గా ఎ. అరుణ, వైస్ చైర్మన్‌గా టీ. శశీంద్ర ఎన్నికయ్యారు. అలాగే పూర్వ విద్యార్థి మరియు దాత ప్రతినిధిగా గడ మధుమాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, పాఠశాల కార్యక్రమాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చించారు. నూతన కమిటీ సభ్యులకు పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

