📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకం టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం!

కాణిపాకం టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం!

📰 Generate e-Paper Clip

-ఆర్టీసీ బస్సు–ఈచర్ వాహనం ఢీ.. పలువురికి రక్తగాయాలు

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు అక్టోబర్ 23 : చిత్తూరు కాణిపాకం టోల్‌గేట్ సమీపంలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు, ఈచర్ వాహనం ఢీకొన్న ఘటనలో పలువురికి రక్తగాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు వైపు నుంచి కామలాపురం సర్వీసుకు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు, అదే సమయంలో మురుకంబట్టు వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ వాహనం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఎదురుపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఈచర్ వాహనాన్ని ఢీకొనడంతో ఈచర్ వాహనం బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఈచర్ డ్రైవర్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్, బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు రక్తగాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహరాజు తన సిబ్బందితో కలిసి క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించడంతో వాహనాల రాకపోకలు తిరిగి సజావుగా సాగాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!