📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో - అమరం కండ్రిగ గ్రామంలో- బాలింతలు, చిన్నారుల పోషకాహారంపై అవగాహన కార్యక్రమం!

టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో – అమరం కండ్రిగ గ్రామంలో- బాలింతలు, చిన్నారుల పోషకాహారంపై అవగాహన కార్యక్రమం!

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 30:ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో, ప్రసవం అనంతరం బాలింతలు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, చిన్నారులకు అందించాల్సిన పోషక విలువలతో కూడిన ఆహారం గురించి వివరించారు.

ఈ సందర్భంగా సంతోషి మేడం గారు మహిళలకు క్లుప్తంగా పలు ఆరోగ్య సూచనలు అందించారు. తల్లులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం అందించాలని సూచించారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు సరైన ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, తగిన జాగ్రత్తలు ఎంతో అవసరమని తెలియజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు, తల్లులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడవచ్చని ఈ కార్యక్రమం తెలియజేసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!