–పుత్తూరు 17వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: హెచ్. అజిత
సత్య వెలుగు న్యూస్ ,పుత్తూరు, అక్టోబర్ 23:పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హెచ్. అజిత వార్డు ప్రజలను ఉద్దేశించి తన విజ్ఞప్తిని తెలియజేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా హెచ్. అజిత మాట్లాడుతూ, 17వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ కాలువల సమస్యలు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
17వ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి తనకు మద్దతు తెలిపి గెలిపించాలని హెచ్. అజిత విజ్ఞప్తి చేశారు




