📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిజయదశమి సందర్భంగా డ్రైవర్లకు దుస్తులు, నగదు పంపిణీ డ్రైవర్లను సొంత బిడ్డల్లా ఆదరిస్తూ భరోసా కల్పించిన...

విజయదశమి సందర్భంగా డ్రైవర్లకు దుస్తులు, నగదు పంపిణీ డ్రైవర్లను సొంత బిడ్డల్లా ఆదరిస్తూ భరోసా కల్పించిన సోమసుందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 20
డ్రైవర్లను సొంత బిడ్డల్లా ఆదరిస్తూ భరోసా కల్పించిన సోమసుందర్ రెడ్డి
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విప్లయర్ యజమాని సోమసుందర్ రెడ్డి తన సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లతో కలిసి పండుగ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లందరికీ దుస్తులు, నగదును అందజేశారు.
డ్రైవర్లను తన కుటుంబ సభ్యులుగా, సొంత బిడ్డల్లా భావిస్తూ వారిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. పండుగ వేళ డ్రైవర్లకు దుస్తులు, నగదు అందజేసి వారితో కలిసి విజయదశమి శుభాకాంక్షలు పంచుకున్నారు.
యజమాని తమను కుటుంబ సభ్యుల్లా ఆదరించి, ఆప్యాయతతో పలకరించి, అండగా ఉంటానని భరోసా ఇవ్వడంపై డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. విజయదశమి సందర్భంగా సంస్థ యాజమాన్యం, డ్రైవర్ల మధ్య ఆత్మీయత, అనుబంధం ఉంటుంది

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!