తిరుపతి జిల్లా, సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో టీడీపీ అభ్యర్థికి పార్టీ నాయకులు అండగా నిలిచారు. అభ్యర్థికి ధైర్యం చెబుతూ, ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులంతా ఐక్యంగా అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ, “నువ్వు ధైర్యంగా ముందుకు సాగు.. మేమంతా నీకు తోడుగా ఉంటాం. ప్రతి అడుగులో నీకు అండగా నిలుస్తాం” అంటూ భరోసా ఇచ్చారు.
పార్టీ నాయకుల ఐకమత్యం, పరస్పర సహకారం అభ్యర్థిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. నాయకుల మద్దతుతో అభ్యర్థి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. 15వ వార్డులో పార్టీ శ్రేణుల సమష్టి కృషితో ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో టీడీపీ నాయకులు ముందుకు సాగుతున్నారు.

