-డాక్టర్ పాతపాటి రవిరాజు, కోనేటి రవిరాజులకు గజమాలలు, దుశ్శాలువాలతో సత్కారం
పుత్తూరు,సత్య వెలుగు న్యూస్: ఉషోదయ వాకర్స్ అసోసియేషన్, పుత్తూరు ఆధ్వర్యంలో ప్రముఖ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇంటర్నేషనల్ అంబాసిడర్ అవార్డు గ్రహీత డాక్టర్ పాతపాటి రవిరాజు మరియు డాక్టరేట్ అవార్డు గ్రహీత కోనేటి రవిరాజులను ఘనంగా సన్మానించారు. వారికి గజమాలలు వేసి, దుశ్శాలువాలతో సత్కరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, పూర్ హోమ్స్, పేద విద్యార్థులకు సహాయం తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారి సేవలను గుర్తించి అవార్డులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరిద్దరూ ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తూ, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో అధ్యక్షుడు, కార్యదర్శి హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు WR. బి. బాబు, కార్యదర్శి హెచ్. రామ్మోహన్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ కె. చంద్రబాబు, కోశాధికారి ఆర్. రమేష్ పాల్గొన్నారు.
అలాగే అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్, కార్వేటినగరం అధ్యక్షులు నడింపల్లి యువరాజు, వాకర్స్ సభ్యులు వెంకటేష్, చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.

