తిరుపతి: అంబేద్కర్ సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు తిరుపతి అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 3, 2026 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిద్ధాంత అధ్యయన తరగతి నిర్వహించనున్నారు.
శ్రీ చల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ కమిటీ, ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మాస్టర్ రామచంద్రరావు ఇంగిలాల ప్రధాన బోధకులుగా పాల్గొని “అంబేద్కరిజం – మూడు రంగాల పోరాటం” అంశంపై బోధించనున్నారు.
తేదీ: 03-10-2026 (శనివారం)
సమయం: సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 వరకు
వేదిక: అంబేద్కర్ భవన్, తిరుపతి
విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు, అంబేద్కర్ సిద్ధాంతాలపై ఆసక్తి ఉన్నవారు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

