📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeస్పోర్ట్స్స్మృతికి అంజుమ్‌ చోప్రా కీలక సూచన

స్మృతికి అంజుమ్‌ చోప్రా కీలక సూచన

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, అక్టోబరు 9,సత్య వెలుగు న్యూస్: భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా కీలక సూచనలు చేశారు. మాజీ సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వ శైలిని అనుకరించాల్సిన అవసరం లేదని, స్మృతి తనదైన పంథాలో జట్టును ముందుకు నడిపించాలని అన్నారు. కెప్టెన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, జట్టును తదుపరి స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
జింబాబ్వే సిరీస్‌తో తొలి బాధ్యతలు
జింబాబ్వేతో అక్టోబరు 16 నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌తో స్మృతి మంధాన పూర్తిస్థాయి కెప్టెన్‌గా తన బాధ్యతలను ప్రారంభించనుందని కథనంలో పేర్కొన్నారు. గతంలోనూ ఆమె భారత జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉందని అంజుమ్‌ గుర్తుచేశారు. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనే స్మృతి జట్టును నడిపించిందని తెలిపారు.
హర్మన్‌ప్రీత్‌తో పోలిక వద్దు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో స్మృతిని పోల్చడం సరికాదని అంజుమ్‌ అభిప్రాయపడ్డారు. గత కెప్టెన్లతో పోలిస్తే స్మృతికి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టకముందే వ్యూహాలను అమలు చేయడానికి, నాయకత్వ అనుభవాన్ని పెంచుకోవడానికి అవకాశం లభించిందని చెప్పారు. అందువల్ల తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రత్యేక నాయకత్వ శైలిని రూపొందించుకోవాలని సూచించారు.
జట్టును తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి
నాయకత్వ మార్పును అంజుమ్‌ చోప్రా రిలే పరుగుపందెంలో బాటన్‌ అందుకోవడంతో పోల్చారు. స్మృతి ఇప్పటికే జట్టు ప్రయాణంలో భాగమై ఉండటంతో నాయకత్వ బాధ్యతలను స్వీకరించడంలో ఆమెకు కొంత ముందస్తు అనుభవం ఉందని వివరించారు. దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్‌, స్మృతి మంధాన ఒకే తరానికి చెందిన ఆటగాళ్లని పేర్కొంటూ.. జట్టులోని బలాలు, బలహీనతలను గుర్తించి అవసరమైన మార్పులు చేయడం కొత్త కెప్టెన్‌ ముందున్న ప్రధాన సవాల్‌ అని అంజుమ్‌ అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!