📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీకాళహస్తి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి. పావని

శ్రీకాళహస్తి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి. పావని

📰 Generate e-Paper Clip

-నూతన డీఎస్పీకి పోలీసు అధికారులు, సిబ్బంది అభినందనలు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 8: శ్రీకాళహస్తి సబ్‌డివిజన్‌ నూతన డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావనిని నియమిస్తూ రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అక్టోబర్ 6న ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఇప్పటివరకు డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉండగా, బి. పావనికి శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ బాధ్యతలు అప్పగించారు. గతంలో శ్రీకాళహస్తి డీఎస్పీగా పనిచేసిన కె. నరసింహమూర్తి గూడూరుకు బదిలీ కావడంతో ఈ పోస్టు ఖాళీ ఏర్పడింది.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది నూతన డీఎస్పీ బి. పావనిని మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంపై ఆమె దృష్టి సారించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!