దొరవారిసత్రం: మండలంలోని సింగనాలతోరు గ్రామంలో రైతులకు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని లక్ష్మణ్నగర్కు చెందిన నేలపట్టు ప్రకాష్, ముప్పాల నారాయణరాజు ఎమ్మెల్యేను కలిసి తమ వార్డులో నెలకొన్న సమస్యలను వివరించారు.
లక్ష్మణ్నగర్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ కాలువలు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ప్రజల సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సానుకూలంగా విని, లక్ష్మణ్నగర్లో రోడ్డు, డ్రైనేజీ కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే స్పందించడంపై లక్ష్మణ్నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

