📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినిర్లక్ష్యానికి నిదర్శనంగా బంగారంపేట సచివాలయ భవనం

నిర్లక్ష్యానికి నిదర్శనంగా బంగారంపేట సచివాలయ భవనం

📰 Generate e-Paper Clip

-ఐదేళ్లుగా ప్రారంభ దశలోనే నిర్మాణ పనులు.. తుప్పుపట్టిన ఇనుపకమ్మీలు

-పొదలు, చెట్లతో నిండిపోయిన నిర్మాణ ప్రదేశం

పెళ్లకూరు, అక్టోబర్ 7, సత్య వెలుగు న్యూస్ :
పెళ్లకూరు మండలం బంగారంపేట గ్రామంలో నూతన సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోవడంతో భవన నిర్మాణానికి వినియోగించిన ఇనుపకమ్మీలు తుప్పుపట్టిపోయాయి. నిర్మాణ ప్రదేశం మొత్తం చెట్లు, పొదలతో నిండిపోయి అధ్వానంగా మారింది.

ఏళ్ల తరబడి భవన నిర్మాణం వైపు సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయనే ఆందోళన గ్రామస్థుల్లో వ్యక్తమవుతోంది.

గ్రామస్థులకు అందుబాటులో ఉండాల్సిన సచివాలయ భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రభుత్వ సేవలు, పరిపాలనా సౌకర్యాలపై కూడా ప్రభావం పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిలిచిపోయిన సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి, అవసరమైన నిధులు కేటాయించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బంగారంపేట గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!