📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనానికి రేపు భూమిపూజ

నాయుడుపేటలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనానికి రేపు భూమిపూజ

📰 Generate e-Paper Clip

-రూ. 3.40 కోట్ల HAM నిధులతో నూతన భవన నిర్మాణం

నాయుడుపేట, అక్టోబర్ 12, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రేపు (అక్టోబర్ 13, మంగళవారం) ఉదయం 10 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయుడుపేట పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు.

పాత ఎమ్మార్వో కార్యాలయ స్థలంలో రూ. 3 కోట్ల 40 లక్షల HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) నిధులతో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ హాజరుకావాలని నాయుడుపేట పురపాలక సంఘం కమిషనర్ ఆహ్వానించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!