📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేతపై ఆందోళన

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేతపై ఆందోళన

📰 Generate e-Paper Clip

-ప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వాలి..

-ప్రతిపక్షం ప్రెస్‌మీట్‌లకే పరిమితం కావడం దారుణం: సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్

కోట, అక్టోబర్ 4: కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం దారుణమని సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యానగర్‌లో ఆదివారం రెండు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సమాజ చైతన్య సమితి అధ్యక్షుడు ఉయ్యాల రామకృష్ణారావు మాట్లాడుతూ.. దళితుల విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో ప్రభుత్వం మౌనం వహించడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం దళితుల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై దళిత సమాజంలో తీవ్ర ఆవేదన నెలకొందన్నారు. గురుకుల పాఠశాల సమస్యపై వైసీపీ నాయకులు ఉద్యమ నాయకులతో కలిసి పోరాడతామని ప్రకటించి, ఆ తర్వాత మౌనంగా ఉండటం సరికాదన్నారు. కోట ప్రాంత చరిత్రను ఎలుగెత్తి చాటిన నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించిన గురుకుల పాఠశాలను మూసివేస్తున్నా ఆయన వారసులు స్పందించకపోవడం విచారకరమన్నారు.

బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివప్రసాద్ మాట్లాడుతూ.. దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న గురుకుల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పోరాటం ద్వారా విద్య ప్రాధాన్యతను గుర్తించిన దళిత వర్గాలు విద్య, ఉద్యోగాల ద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశం పొందాయని తెలిపారు.

గురుకుల పాఠశాలను మూసివేసి విద్యార్థులను సరైన వసతులు లేని ఇతర పాఠశాలలకు తరలించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కొందరు విద్యార్థులు చదువు మానుకుని టీసీలు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాల కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నిలిపివేయడం, COE పేరుతో బాలురు, బాలికలను కలిపి ఉంచడం వంటి నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయని తెలిపారు.

సమాజ చైతన్య సమితి నాయకుడు పంట్రంగం వసంత్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల పునఃప్రారంభం కోసం కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. పాఠశాల పునఃప్రారంభం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సమాజ చైతన్య సమితి నాయకులు ఉయ్యాల రామకృష్ణారావు, పంట్రంగం వసంత్, తిరుమూరు క్రిష్ణయ్య, ఎన్. బాబు, బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివప్రసాద్, కన్వీనర్ దాసరి అశోక్ కాంబ్లే, గౌరవ సలహాదారు కనుపూరు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!