📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో 14, 17వ వార్డుల్లో సీపీఎం ఇంటింటి ప్రచారం

నాయుడుపేటలో 14, 17వ వార్డుల్లో సీపీఎం ఇంటింటి ప్రచారం

📰 Generate e-Paper Clip

-దోమల నివారణకు చర్యలు చేపట్టాలి..

-నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 14, 17వ వార్డుల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పాల్గొని స్థానిక సమస్యలను ప్రజలకు వివరిస్తూ, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి

ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ.. నాయుడుపేట మున్సిపాలిటీలో దోమల బెడద తీవ్రంగా ఉందని, దోమల వల్ల ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల నివారణకు మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూములను పేదలకు కేటాయించాలి

మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారంటూ వందవాసి నాగరాజు ఆరోపించారు. మరోవైపు నిరుపేద కుటుంబాలు సరైన నివాస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు కేటాయించే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏది?

14వ వార్డు సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ ఆఫీస్, 17వ వార్డు అభ్యర్థి శివకవి ముకుంద ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొద్దిపాటి వర్షం కురిసినా నాయుడుపేటలోని అనేక వీధుల్లో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా నిధుల కొరత కారణంగా పరిష్కారం చూపలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.

గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న నాయుడుపేట అత్యధిక ఆదాయం కలిగిన పంచాయతీల్లో ఒకటిగా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీకి ఇంటి పన్ను, చెత్త పన్ను, కొళాయి పన్నులతో పాటు దుకాణాలు, ఇతర ఆస్తుల అద్దెల ద్వారా ఆదాయం వస్తున్నప్పటికీ, అభివృద్ధి పనులకు నిధులు లేవని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని ఎక్కడ, ఎలా ఖర్చు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

మురుగునీటి కాలువల నిర్మాణం, నాణ్యమైన రహదారుల ఏర్పాటు, దోమల నివారణ, పారిశుధ్య మెరుగుదల, నిరుపేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వంటి సమస్యల పరిష్కారానికి సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కే. రాంబాబు, కే. విజయమ్మ, కే. వానమ్మ, ఐద్వా నాయకురాలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!