📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలు, 123 మున్సిపాలిటీల ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక...

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలు, 123 మున్సిపాలిటీల ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

📰 Generate e-Paper Clip

-గోదావరి పుష్కరాలకు రూ.2,000 కోట్లు

-రాజమహేంద్రవరం అభివృద్ధికి రూ.1,000 కోట్లు

-2028 నాటికి అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు

అమరావతి, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, న్యాయస్థానం తీర్పు అనంతరం రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

అమరావతిలో శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇటీవల ఏపీ హైకోర్టు 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

రాబోయే 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనుల కోసం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

రాజమహేంద్రవరం ప్రాంత అభివృద్ధి పనులకు సుమారు రూ.1,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రహదారులు, ఘాట్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

తాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ

గతంలో నిలిచిపోయిన కొన్ని తాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో కొన్ని పనులు నిలిచిపోయాయని, వాటిని పునరుద్ధరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలకు తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని మంత్రి అన్నారు.

2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు

అమరావతి రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మౌలిక వసతుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

2028 చివరి నాటికి అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రధాన పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. వివిధ మౌలిక వసతుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!