📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. ఐదుగురు మృతి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. ఐదుగురు మృతి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

📰 Generate e-Paper Clip

శ్రీసిటీ: శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం రూ.2.5 కోట్ల పరిహారం అందించనున్నారు.

పరిశ్రమలో 2 టన్నుల బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కలెక్టర్ వెల్లడించారు. బాయిలర్‌ను ఫిట్‌గా ధ్రువీకరించిన ఇన్‌స్పెక్టర్ రాంబాబును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!