📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట 22వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి అవకాశం కల్పించండి

నాయుడుపేట 22వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి అవకాశం కల్పించండి

📰 Generate e-Paper Clip

-కూటమి పెద్దలకు బురకాల లీల మోహన్ వినమ్ర విజ్ఞప్తి

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని బురకాల లీల మోహన్ కూటమి పెద్దలు, నాయకులను వినమ్రంగా కోరారు.

నాయుడుపేట మున్సిపాలిటీలోని 22వ వార్డు (ఎస్సీ జనరల్) నుంచి ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలనే ఆకాంక్షతో ఆయన తన అభ్యర్థిత్వాన్ని కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

వార్డులోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, స్థానిక అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో ప్రజాసేవకు అవకాశం కోరుతున్నట్లు తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి, జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కూటమి నాయకులకు విజ్ఞప్తి చేశారు.

కూటమి పెద్దల ఆశీస్సులు, నాయకుల మద్దతు లభిస్తే ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతానని బురకాల లీల మోహన్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!