పెళ్లకూరు,సత్య వెలుగు న్యూస్:శిరసనంబేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ రేసులో వేలూరు మహేందర్ రెడ్డి పేరు దూసుకుపోతోంది. టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.శిరసనంబేడు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా, నాయకుడిగా సేవలు అందిస్తున్నారు.గ్రామంలో ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటూ, అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.గ్రామ ప్రజలే తమ అభ్యర్థిగా మహేందర్ రెడ్డిని ఎన్నుకున్నారని స్థానికులు చెబుతున్నారు. పెద్దల నుంచి యువత వరకు అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. గ్రామ అభివృద్ధి చేయగల సమర్థుడు మహేందర్ రెడ్డి మాత్రమేనని వారు అంటున్నారు.ఓసీ రిజర్వేషన్ వస్తే ఈసారి సర్పంచ్ పీఠం మహేందర్ రెడ్డికే దక్కుతుందని గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుస్తూ, తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.సర్పంచ్ గా గెలిస్తే గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చేస్తానని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని మహేందర్ రెడ్డి హామీ ఇస్తున్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తానని ఆయన తెలిపారు.
సర్పంచ్ రేసులో మహేందర్ రెడ్డి
0
30
Next article
- Advertisment -ads




