📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యబోయకొండ గంగమ్మ ఆలయంలో ఘనంగా వరుణ యాగం – వరుణ జపం

బోయకొండ గంగమ్మ ఆలయంలో ఘనంగా వరుణ యాగం – వరుణ జపం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 5, సత్య వెలుగు న్యూస్:
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ “వరుణ యాగం – వరుణ జపం” కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వరుణ యాగం, వరుణ జపం నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ కూటమి ఇన్‌చార్జ్ గౌరవ శ్రీ వై. మధుసూదన్ నాయుడు ఉదయం 10:30 గంటలకు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చౌడేపల్లి మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరుణ యాగం–వరుణ జపం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!