📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి రెండు వార్డులు ఏకగ్రీవం

సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి రెండు వార్డులు ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

-11వ వార్డులో దంతాల మోహన సుందరి,

-24వ వార్డులో ఎస్. మీనా ఏకగ్రీవ ఎన్నిక

సత్య వెలుగు న్యూస్ , సూళ్లూరుపేట:సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డు నుంచి దంతాల రవి సతీమణి దంతాల మోహన సుందరి, 24వ వార్డు నుంచి ఎస్. మీనా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం.

ఈ రెండు వార్డుల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పార్టీ నాయకుల సత్కారం

పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ నేతృత్వంలో ఏకగ్రీవంగా ఎన్నికైన దంతాల మోహన సుందరి, ఎస్. మీనా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొండేపాటి గంగా ప్రసాద్, ఎమ్మెల్యే విజయశ్రీ, తిరుమూరు సుధాకర్ రెడ్డితో పాటు బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డిని శాలువాలతో సత్కరించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు వార్డుల్లో ఏకగ్రీవ ఫలితాలు వెలువడటంతో స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!