-సీఎం చంద్రబాబు నివాసంలో తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌తో సమావేశం
అమరావతి, సత్య వెలుగు న్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సమావేశమయ్యారు.
తన నివాసానికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సమావేశమైనట్లు సమాచారం.
మంత్రులు, ఎంపీతో పరిచయం
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి నారాయణ, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిచయం చేశారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని కలిగించింది. అయితే సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.




