📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యపుదిపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో నేత్రపర్వంగా గాయత్రీ దేవి అలంకరణ

పుదిపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో నేత్రపర్వంగా గాయత్రీ దేవి అలంకరణ

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 12 , సత్య వెలుగు న్యూస్:అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయాన్నే ఆలయ అర్చకురాలు శ్రావణి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం సకల ఆభరణాలు, విశేష పుష్పాలతో అమ్మవారిని గాయత్రీ దేవి రూపంలో సుందరంగా అలంకరించారు. అమ్మవారి దివ్య అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ దివ్యదర్శనం కోసం చౌడేపల్లి మండల పరిసర గ్రామాలతో పాటు బెంగళూరు, మదనపల్లి, పుంగనూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

రెండో రోజు ఉత్సవాలకు లబ్ధిగం గ్రామానికి చెందిన పచ్చిరాల కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మార్మోగింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!