📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యనకిలీ ఐడీ కార్డులతో మోసాలు.. వ్యక్తి అరెస్ట్‌!

నకిలీ ఐడీ కార్డులతో మోసాలు.. వ్యక్తి అరెస్ట్‌!

📰 Generate e-Paper Clip

-ప్రభుత్వ పనులు చేయిస్తానంటూ ప్రజలకు బెదిరింపులు.. డబ్బుల వసూలు

మదనపల్లె, అక్టోబర్ 12, సత్య వెలుగు న్యూస్:ప్రభుత్వ పనులు చేయిస్తానని నమ్మిస్తూ, నకిలీ ఐడీ కార్డులతో ఎన్జీవో ప్రతినిధిగా చలామణి అవుతూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మదనపల్లె మొదటి పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.

వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడు

పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన షేక్‌ సయ్యద్‌ మీర్‌ (50) వాహన తనిఖీల సందర్భంగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి మోసాలకు ఉపయోగించిన కారుతో పాటు నకిలీ గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ పనులు చేయిస్తామంటూ, అధికారుల పేర్లు చెప్పి ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించి ప్రజలను మోసగించే ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

అధికారుల పేర్లు చెప్పి డబ్బులు అడిగే నకిలీ దళారులను నమ్మవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్‌ కునుబిల్లి, ఐపీఎస్‌ ప్రజలకు సూచించారు. ఎవరైనా మోసాలకు లేదా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

ప్రభుత్వ పనుల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే వారి గుర్తింపు, అధికారిక హోదాను నిర్ధారించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!