📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యస్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా చిన్నా రాయల్‌కు బాధ్యతలు, అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు సీవీ...

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా చిన్నా రాయల్‌కు బాధ్యతలు, అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు సీవీ గంగాధర్ కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

పుంగనూరు టౌన్, అక్టోబర్ 12 ,సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో భాగంగా పుంగనూరు అసెంబ్లీ కమిటీలో సమన్వయకర్తగా తనకు అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి సీవీ గంగాధర్ (చిన్నా రాయల్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని చిన్నా రాయల్ తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

అదేవిధంగా, తనతోపాటు నియోజకవర్గంలో పార్టీ పదవులు పొందిన నాయకులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తానని సీవీ గంగాధర్ (చిన్నా రాయల్) స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!