📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లు

పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లు

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, మేజర్ న్యూస్:పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ధనంజయులుకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా చావలి ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ నేత ఎద్దల నరేంద్ర రెడ్డి, పెళ్లకూరు నుంచి తడగల అమరావతి, కన్నలి బుజ్జమ్మ, మేరుం సుమతి, రోసనూరు నుంచి పల్లమాల చంద్రయ్య, పల్లమాల ఆదెమ్మ, చెంబేడు నుంచి చెంబేటి రాఘవయ్య, మూరతోటి రమణయ్య, పాలచూరు నుంచి కాటంరెడ్డి ఝాన్సీ దేవి, కలవకూరు నుంచి శాఖమూరి హరికృష్ణ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో స్పందన ఉందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. నామినేషన్ల కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!