📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచిల్లకూరులో స్మార్ట్ శ్రామిక్ మిషన్ అవగాహన కార్యక్రమం

చిల్లకూరులో స్మార్ట్ శ్రామిక్ మిషన్ అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్:
గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులు, వివిధ వృత్తిదారులు, యువతకు ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య, సామాజిక భద్రతా సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్మార్ట్ శ్రామిక్ మిషన్ (SSM) ఆధ్వర్యంలో పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా మిషన్ కోఆర్డినేటర్ పి. విజయలక్ష్మి ఆదేశాల మేరకు, SSM మేనేజింగ్ డైరెక్టర్ డా. సూర్య నాగేంద్ర, మిషన్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చిల్లకూరు మాజీ సర్పంచ్ పి. హరిబాబు రెడ్డి, దామోదర్ రెడ్డి, గిరి రెడ్డి, డీవీఎంసీ సుజిత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్మార్ట్ శ్రామిక్ మిషన్ ద్వారా కార్మికులకు అందించే వివిధ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్య–బీమా సేవలు, డిజిటల్ సేవలపై అవగాహన కల్పించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి శ్రామికుడు, వృత్తిదారుడు స్మార్ట్ శ్రామిక్ మిషన్ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథులు సూచించారు. కార్మికుల ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్య భద్రత, సామాజిక భద్రతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా SSM చేపడుతున్న కార్యక్రమాలను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో SSM బృందం సభ్యులు, స్థానిక కార్మికులు, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!