న్యూఢిల్లీ, అక్టోబర్ 5, సత్య వెలుగు న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
SIR (Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు చట్టప్రకారం ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో తీసుకున్నారా అనే అంశంపై కోర్టు వివరాలు కోరింది. చట్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే వాటిని పునఃపరిశీలించే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.
అయితే సీఈసీని తక్షణమే సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఈ దశలో ఆదేశాలు ఇవ్వలేదు. ఎన్నికల సంఘం, కేంద్రం నుంచి వారం రోజుల్లో సమాధానం కోరింది.